నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో సోమవారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతిని పద్మశాలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మార్కండేయ ఆలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పద్మశాలి మండల అధ్యక్షులు సామల వీరయ్య మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన పదవుల కంటే ప్రజల ఆకాంక్షలకే ప్రాధాన్యత ఇచ్చారని, గొప్ప పోరాటయోధుడని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మీ నారాయణ, ప్రసాద, శంకర్, భుమేష్, నర్సయ్య, శ్రీనివాస్, యోగేష్ తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

