అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి గర్భిణికి సురక్షిత ప్రసవం చేసిన 108 అంబులెన్స్ సిబ్బందిపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
మామడ మండలం వాస్తాపూర్ గ్రామానికి చెందిన పి. రజిత (23)కు తొలి కాన్పు నొప్పులు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే కు చెందిన 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ సురేష్, వాహన చోదకుడు హఫీజ్ గ్రామానికి చేరుకున్నారు.
అప్పటికే ప్రసవ నొప్పులు తీవ్రం కావడంతో ఆసుపత్రికి తరలించే అవకాశం లేకపోవడంతో, ఈఎంటీ సురేష్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇంటి వద్దనే ప్రసవం చేశారు. రజిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
అనంతరం తల్లీబిడ్డను అంబులెన్స్‌లో నిర్మల్ మాతా శిశు ఆసుపత్రికి తరలించి, వైద్యుల పర్యవేక్షణలో చేర్పించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఆపద సమయంలో సకాలంలో స్పందించి తల్లీబిడ్డ ప్రాణాలను కాపాడిన 108 సిబ్బంది సేవలను గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అభినందించారు.












