మండలం, కూచులాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ-ప్రైమరీ స్కూల్‌ను మండల విద్యాధికారి ఎం.డి. హుస్సేన్ శనివారం ప్రారంభించారు. గ్రామంలోని చిన్నారులను విద్యకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ మైలి నారాయణ, ఉపసర్పంచ్ సుద్దుల అరుణ్‌రెడ్డి ఈ పాఠశాల ఏర్పాటుకు కృషి చేశారు.
గ్రామంలోని చిన్నారులను విద్యకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ మైలి నారాయణ, ఉపసర్పంచ్ సుద్దుల అరుణ్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రీ-ప్రైమరీ స్కూల్ ఏర్పాటుకు కృషి చేశారు. ఈ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎం.డి. హుస్సేన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ, చిన్నారుల్లో విద్యపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, సృజనాత్మకత, సామాజిక విలువలను పెంపొందించేలా ప్రీ-ప్రైమరీ విద్య దోహదపడుతుందని అన్నారు. ప్రీ-ప్రైమరీ విద్య పిల్లల సమగ్ర వికాసానికి పునాది వేస్తుందని ఆయన తెలిపారు. గ్రామంలోనే చిన్నారులకు విద్యావకాశం కల్పించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇది తమ పిల్లల భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రావ్యరాణి, రణధీర్, ప్రీ-ప్రైమరీ టీచర్ దీపిక, అంగన్వాడీ టీచర్లు కళావతి, ప్రమీలతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు. పాఠశాల నిర్వహణకు అందరూ సహకరించాలని కోరారు.












