వివరాలను
దేశంలో వాయు కాలుష్యం కారణంగా పెరుగుతున్న శ్వాసకోశ, గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కాలుష్య ప్రభావంతో ఆసుపత్రులకు వస్తున్న రోగుల క్రమబద్ధంగా నమోదు చేసి, ప్రభుత్వ ఆరోగ్య విభాగాలకు నివేదించేలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యంగా ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాలుష్యం వల్ల ఎంతమంది అనారోగ్యానికి గురవుతున్నారు, ఏ వయసు వారిపై ఎక్కువ ప్రభావం పడుతోంది, ఎలాంటి వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయి అనే అంశాలపై స్పష్టమైన సమాచారం సేకరించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
ఛెస్ట్ క్లినిక్లలో ప్రత్యేక నిఘా
కేంద్రం చేపట్టిన చర్యల్లో భాగంగా కార్డియో-రెస్పిరేటరీ ఆరోగ్య సమస్యల గుర్తింపు, చికిత్స కోసం ఏర్పాటు చేసిన ఛెస్ట్ క్లినిక్లు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ క్లినిక్లకు వచ్చే రోగుల ప్రతిరోజూ నమోదు చేయాలని సూచించారు. రోగులకు సంబంధించిన లక్షణాలు, వ్యాధి నిర్ధారణ, కాలుష్యానికి గురైన స్థాయి వంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ () రూపొందించిన వ్యాధి గుర్తింపు కోడ్ల ఆధారంగా నమోదు చేయాల్సి ఉంటుంది.
జాతీయ స్థాయికి నివేదికలు
ఆసుపత్రులు ప్రతిరోజూ సేకరించిన రోగుల జిల్లా, రాష్ట్ర ఆరోగ్య అధికారులకు పంపించాలి. రాష్ట్ర స్థాయి అధికారులు ఈ సమాచారాన్ని నెలవారీగా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ()కు అందించాల్సి ఉంటుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి కార్యక్రమం అమలు తీరుపై సమీక్షలు నిర్వహించాలని సూచించారు.
అధిక ప్రమాదంలో ఉన్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఛెస్ట్ క్లినిక్లను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లతో అనుసంధానించనున్నారు. ఆశా కార్యకర్తల ద్వారా అవసరమైన రోగుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించే ఏర్పాట్లు కూడా చేయనున్నారు.
కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు
వాయు కాలుష్యంలోని సూక్ష్మ ధూళి కణాలు, ముఖ్యంగా 2.5, శరీరంలోకి ప్రవేశించి ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. దీర్ఘకాలికంగా కాలుష్యానికి గురికావడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలుష్యం వల్ల వచ్చే అనారోగ్యాన్ని ఇతర కారణాల నుంచి వేరు చేసి గుర్తించడం వైద్యులకు సవాలుగా మారుతోంది.
ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్లు, వాతావరణ మార్పులు, అలర్జీలు కూడా ఇలాంటి లక్షణాలనే కలిగించవచ్చు. అందుకే రోగుల ఒకే విధానంలో నమోదు చేయడం ద్వారా కాలుష్య ప్రభావంపై మరింత స్పష్టమైన సమాచారం లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ చర్యలతో దేశంలో వాయు కాలుష్యానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలపై మెరుగైన పర్యవేక్షణ సాధ్యమవుతుందని కేంద్రం భావిస్తోంది.
వాయు కాలుష్యం వల్ల పెరుగుతున్న శ్వాసకోశ, గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కాలుష్య ప్రభావంతో ఆసుపత్రులకు వస్తున్న రోగుల వివరాలను క్రమబద్ధంగా నమోదు చేసి, ప్రభుత్వ ఆరోగ్య విభాగాలకు నివేదించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కోడ్ల ఆధారంగా వివరాలు నమోదు చేయాలి.






