గాంధీనగర్, తాళ్లగడ్డ, మిర్యాలగూడ, నల్గొండ, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 10
ఐసీడీఎస్ మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని పురస్కరించుకుని, గాంధీనగర్ సెక్టార్ పరిధిలోని తాళ్లగడ్డ అంగన్వాడీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సూపర్ వైజర్ నజీమాబేగం మొహమ్మద్ ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రోటీన్లు, ధాన్యాలు, కూరగాయలు, పండ్ల ప్రాముఖ్యతను వివరించారు.
ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహరం తీసుకోవాలి : 👉 గాంధీనగర్ లో పోషణమాసంలో సూపర్ వైజర్ నజీమా మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) ఐసీడీస్ మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలో నుండి వరకు పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా సీడీపీఓ పి.వేణుగోపాల్ రావు షెడ్యూల్ ప్రకారం ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం, మన అంగన్వాడీ - మన బాధ్యత అనే థీమ్ తో నిర్వహించాలన్న కార్యక్రమంలో భాగంగా గాంధీనగర్ సెక్టార్ పరిధిలోని తాళ్లగడ్డ అంగన్వాడీ కేంద్రంలో పోషణా మాసంను నిర్వహించి, ప్రదర్శన స్టాళ్ల ద్వారా వివిధ రకాల ఆహార పదార్థాల ప్రాముఖ్యత సూపర్ వైజర్ నజీమాబేగం మొహమ్మద్ వివరించారు.ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి ఆహార వైవిధ్యాన్ని తల్లులకు తెలిపారు. అదేవిధంగా ధాన్యాలు చిరుధాన్యాలు వాటి విశిష్టత గురించి, వాటిని తినడం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు. టీహెచ్ఆర్ వంటకాలు, హెచ్సిఎం మెనూ, స్థానికంగా లభించిన ఆహార పదార్థాలతో తయారు చేసే ప్రాంతీయవంటకాలను ప్రదర్శించారు. అలాగే పసుపు, నారింజ రంగు కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, వంట నూనెలు, ప్రాముఖ్యత వాటి వలన పిల్లలకు, గర్భిణీ,బాలింతలకు ,తల్లులకు కలిగే లాభాలు వివరించారు. కార్యక్ర మంలోసూపర్వైజర్ నజీమా బేగం మహమ్మద్, బ్లాక్ కోఆర్డినేటర్ కవిత, అంగన్వాడీ టీచర్స్ పద్మ, షమీం, నసీమ, నాగలక్ష్మి, హెల్పర్ భాగ్యలక్ష్మిసమ భావన సంఘం సభ్యులు విశాలాక్షి, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, పిల్లలు, తల్లులు, పెద్దలు పాల్గొన్నారు.












