నాణ్యమైన వైద్య సేవలు అందించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. రాజేందర్. సారంగాపూర్ ,నిర్మల్ జిల్లా సారంగాపూర్:ప్రజలకు సకాలంలో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందేలా ఆరోగ్య సిబ్బంది అంకితభావంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రాజేందర్ సూచించారు. మండలంలోని జామ్, కౌట్ల, మలక్ చించోలి,స్వర్ణ ఆరోగ్య ఉప కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.రాజేందర్ సందర్శించి, అక్కడ అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల లభ్యత, రికార్డులు, ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఆరోగ్య ఉప కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలకు అవసరమైన వైద్య సేవలను ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, చిన్నపాటి అనారోగ్యాలకు సకాలంలో చికిత్స అందించాలని, అసంక్రమిక వ్యాధుల (ఎన్ సిడి) స్క్రీనింగ్‌ను లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని సూచించారు.గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు మరియు ఇతర అవసరమైన వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సేవలు పూర్తిస్థాయిలో అందేలా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.అనంతరం మండలంలో నిర్మాణంలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్ర భవనాలను పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతిని, నాణ్యతను పరిశీలించి, పనులను నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పూర్తి చేసి, ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్, డీపీఓ రామచందర్, ఆరోగ్య పర్యవేక్షకులు శ్రీనివాస్,ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
నాణ్యమైన వైద్య సేవలు అందించాలి.
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- ప్రతి ఆరోగ్య ఉప కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలకు అవసరమైన వైద్య సేవలను ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
- నాణ్యమైన వైద్య సేవలు అందించాలి.
- జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.
- సారంగాపూర్ ,నిర్మల్ జిల్లా సారంగాపూర్:ప్రజలకు సకాలంలో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందేలా ఆరోగ్య సిబ్బంది అంకితభావంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3454ఆర్టికల్స్
4,35,103వ్యూస్