జమ్మలమడుగు, 10 September
అత్యవసర సమయంలో రక్తదానం చేసి ఓ మహిళ ప్రాణాన్ని కాపాడారు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ అధ్యక్షుడు అహమ్మద్ హుస్సేన్. కర్నూలులోని అమీలియో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజున్ అనే మహిళకు ఏ పాజిటివ్ రక్తం అవసరమైంది.
రక్తదానం చేయండి.. ఒక జీవితాన్ని కాపాడండి అత్యవసర సమయంలో స్పందించి రక్తదానం చేసిన అహమ్మద్ హుస్సేన్ జమ్మలమడుగు అత్యవసర సమయంలో రక్తదానం చేసి ఓ మహిళకు అండగా నిలిచారు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ అధ్యక్షుడు అహమ్మద్ హుస్సేన్. కర్నూలులోని అమీలియో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజున్ అనే మహిళకు ఏ పాజిటివ్ రక్తం అత్యవసరమని కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ అధ్యక్షుడు అహమ్మద్ హుస్సేన్ వెంటనే స్పందించారు. జమ్మలమడుగు నుంచి కర్నూలుకు వెళ్లి ఆసుపత్రిలో ఏ పాజిటివ్ రక్తాన్ని దానం చేశారు. అత్యవసర సమయంలో స్పందించి రక్తదానం చేయడంతో మహిళకు అవసరమైన రక్తం అందుబాటులోకి వచ్చింది.ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేయడం ద్వారా ఒక నిండు ప్రాణాన్ని కాపాడవచ్చని అన్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.రక్తదాత అహమ్మద్ హుస్సేన్‌కు ఫౌండేషన్ ఫౌండర్ మోరే లక్ష్మణ్‌రావుతో పాటు నిర్వాహకులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రక్తదానం కోసం సంప్రదించవలసిన నంబర్లు: 8297253484, 9182244150












