జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి 108 సిబ్బంది సకాలంలో ప్రథమ చికిత్స అందించి, మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదంలో బాధితుడి వద్ద ఉన్న 15 వేల నగదు, మొబైల్‌ను ఆలేరు 108 సిబ్బంది ఆసుపత్రి సిబ్బందికి అందజేశారు.
ప్రజాసేవతోపాటు మానవత్వంలోనూ తాము ముందుంటామని 108 సిబ్బంది మరోసారి నిరూపించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సకాలంలో ప్రథమ చికిత్స అందించి, అతని వద్ద ఉన్న 15 వేల నగదు, మొబైల్‌ను మానవత్వంతో ఆసుపత్రి సిబ్బందికి అందజేశారు.
వివరాలలోకి వెళితే, మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో జిల్లా వడ్లకొండ గ్రామానికి చెందిన మహేష్, హైదరాబాదు నుండి తన స్వగ్రామం వడ్లకొండకు బైక్‌పై ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. అతనికి గాయాలై స్పృహలో లేకపోవడంతో వెంటనే 108కు సమాచారం అందించారు.
సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది, గాయపడిన మహేష్‌కు నాణ్యమైన ప్రథమ చికిత్సను అందించి, మెరుగైన వైద్యం కోసం ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మహేష్ వద్ద ఉన్న 15,000 రూపాయలు, అతని మొబైల్‌ను అక్కడున్న స్థానికులు 108 సిబ్బందికి అందజేశారు.
ఆ నగదును, వస్తువులను ఆలేరు 108 సిబ్బంది మానవత్వంతో ఆలేరులోని ఆసుపత్రి సిబ్బందికి అందజేశారు. ఈఎంటి వెంకటేష్, పైలెట్ ప్రశాంత్‌లను, అలాగే ఆసుపత్రి సిబ్బంది మానవత్వంతో మహేష్ నగదును, మొబైల్‌ను అందజేసినందుకు ప్రజలు ప్రశంసించారు. ఈ సంఘటన 108 సిబ్బంది సేవా దృక్పథాన్ని, మానవత్వాన్ని తెలియజేస్తుంది.











