పర్యావరణ పరిరక్షణలో వెదురు ఉత్పత్తులకు ఎంతో ప్రాధాన్యం ఉందని జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్ అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాథోడ్ రమేష్, మేదరి సంఘం నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు వెదురు ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడవచ్చని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, ఉపాధి కల్పన, సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు వెదురు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
తరతరాలుగా వస్తున్న సంప్రదాయ వృత్తిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసుకోవాలని సూచించారు. వెదురుతో వివిధ రకాల ఉపయోగకరమైన వస్తువులను తయారు చేసి, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందించడం ద్వారా మరింత ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, సత్యనారాయణ, జిల్లా మేదర సంఘం ప్రధాన కార్యదర్శి ఊరె దశరథ్, ప్రతినిధులు దూడ ప్రమోద్, ఎనుగందుల రాజేందర్, మదిరె కృష్ణ మోహన్, ఎనుగందుల రాజన్న, కనికరం శేఖర్, జొరిగల రాజలింగం, మదిరె మురళి, కనికరం రవి, మదిరె సత్యనారాయణ, కనికరం రాజేందర్, మాద విజయ్, పిల్లి సాయికుమార్, మదిరె వసంత్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.












