లోకేశ్వరం, 15 September
లోకేశ్వరం నారాయణ పాఠశాల విద్యార్థులు మానవతా దృక్పథంతో అనాథ పిల్లలకు అండగా నిలిచేందుకు రూ.5,456 విరాళాన్ని సేకరించారు. ఈ మొత్తాన్ని జిల్లా నస్పూర్‌లోని శ్రీ సాయి అనాథ ఆశ్రమానికి అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాతర్ల నారాయణ చేతుల మీదుగా ఆశ్రమ నిర్వాహకులకు విరాళాన్ని అందించారు.
లోకేశ్వరం నారాయణ పాఠశాల విద్యార్థులు మానవతా దృక్పథంతో అనాథ పిల్లలకు అండగా నిలిచేందుకు రూ.5,456 విరాళాన్ని సేకరించారు. ఈ మొత్తాన్ని జిల్లా నస్పూర్‌లోని శ్రీ సాయి అనాథ ఆశ్రమానికి అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాతర్ల నారాయణ చేతుల మీదుగా ఆశ్రమ నిర్వాహకులకు విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సేవాభావాన్ని పాఠశాల యాజమాన్యం అభినందించింది. చిన్న వయసులోనే సేవా భావం, మానవతా విలువలను పెంపొందించుకోవడం అభినందనీయమని పేర్కొంది.












