రెవెన్యూ శివారులోని కుండలినిలో శ్రీశ్రీశ్రీ గోవింద గిరి స్వామి శతజయంతోత్సవం సందర్భంగా, కృష్ణవేణి ఉన్నత పాఠశాలకు చెందిన 33 మంది విద్యార్థులు కృతజ్ఞత అనే అంశంపై తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో వ్యాసరచన పోటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రారంభించారు.
రెవెన్యూ శివారులోని కుండలినిలో జ్ఞాన యోగి, అవధూత బ్రహ్మ, స్పర్శజ్ఞాని శ్రీశ్రీశ్రీ గోవింద గిరి స్వామి శతజయంతోత్సవం సందర్భంగా, మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలకు చెందిన 33 మంది విద్యార్థులు సోమవారం శ్రీ గోవిందగిరి స్వామి దివ్య యోగాశ్రమంలో తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో కృతజ్ఞత అనే అంశంపై వ్యాసరచన పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణులు, శ్రీ గోవింద గిరి స్వామి శిష్యుడు శ్రీ రాఘవేంద్ర స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తదనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మాట్లాడుతూ, వ్యాసరచన పోటీలు విద్యార్థుల సృజనాత్మకతకు నిలువుటద్దమని అన్నారు. ఈ పోటీల ద్వారా విద్యార్థులు తమ ఆలోచనలను, భావాలను స్పష్టంగా వ్యక్తీకరించే నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సాయిరాం బాలరాజ్, గడ్డం మల్లేష్, కొండ అశోక్ గౌడ్, మహేందర్; సహాయకులు కంకణాల రాజేశ్వర్, తీగల రఘు, వేంపల్లి చంద్రశేఖర్ గౌడ్; కృష్ణవేణి పాఠశాల ప్రిన్సిపాల్ పిల్లమారి శ్రీనివాస్; ఉపాధ్యాయులు మహేష్, శిరీష్, ప్రత్యూష, భారతి; ఆశ్రమ సేవకులు, మాతలు తదితరులు పాల్గొన్నారు.











