సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జిల్లా స్థాయిలో విద్యా రంగంలో అత్యుత్తమ సేవలందించిన ఉపాధ్యాయులలో ఉత్తములకు జిల్లా ఉపాధ్యాయ అవార్డు ఎంపిక చేసి ప్రశంస పత్రం అవార్డుతో సన్మానించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో
పీఏపల్లి మండలంలోని తిరుమలగిరి ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ గా విధులు నిర్వర్తిస్తున్న నేర్నకంటి రామాంజనేయులు నల్లగొండ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ పాల్ రెడ్డి,
జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ల చేతుల మీదుగా అవార్డు, ప్రశంస పత్రంతో సన్మానం పొందారు. ఈ సందర్భంగా రామాంజ నేయులు ను ఉపాధ్యా య సంఘం నాయకులు ఉపాధ్యాయులు, స్నేహితులు,బంధువులు అభినందించి శుభాకాంక్షలుతెలియజేశారు.












