బోథ్ నియోజకవర్గంలో నిరుద్యోగ యువత కోసం ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమాలు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి.
బోథ్ నియోజకవర్గ శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారి ప్రత్యేక శ్రద్ధ, ఆధ్వర్యంలో ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ( ) ద్వారా నిర్వహిస్తున్న ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు నిరుద్యోగ యువత పాలిట దేవుడిలా మారాయని జిల్లా కమ్యూనిటీ మొబిలైజర్ పసుల రమేష్ పేర్కొన్నారు. ఉపాధి లేక ఇబ్బందిపడుతున్న గ్రామీణ నిరుద్యోగ యువతకు సొంత కాళ్లపై నిలబడే గొప్ప అవకాశాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు ప్రథమ్ సంస్థ ద్వారా కల్పిస్తున్నారని ఆయన తెలిపారు.
శిక్షణ వివరాలు
ఈ శిక్షణలో పాల్గొనేందుకు 18 నుండి 35 సంవత్సరాల వయస్సు ఉండి, పదో తరగతి (), ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు అర్హులు. కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వపు (నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) సర్టిఫికేట్ అందజేయబడుతుంది. ఈ సర్టిఫికేట్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది, ఇది దుబాయ్ వంటి విదేశాలలో కూడా ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడుతుంది.
విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ 100 ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత భోజనం, ఉచిత వసతితో పాటు యూనిఫాం (దుస్తులు), షూస్ మరియు బ్యాగులు పూర్తిగా ఉచితంగా అందజేస్తారు.
యువతకు పిలుపు
ఈ సందర్భంగా జిల్లా కమ్యూనిటీ మొబిలైజర్ పసుల రమేష్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదివి ఖాళీగా ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ జీవితాల్లో స్థిరపడాలి అని పిలుపునిచ్చారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాలు మరియు నమోదు కోసం 6303603145, 99598 65645 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.












