ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 3,885వ ర్యాంకు సాధించిన కుంటాల గ్రామానికి చెందిన మెడికల్ విద్యార్థి సాయి ప్రత్యూష్ను గ్రామ సర్పంచ్ జక్కుల గజేందర్, గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ విజయం గ్రామానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు.
ఆల్ ఇండియా, రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకు సాధించి కుంటాల గ్రామానికి గర్వకారణంగా నిలిచిన ప్రత్యూష్ను గ్రామస్తులు అభినందించారు. విద్యార్థి సాధించిన ఈ ఘనత ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ జక్కుల గజేందర్ మాట్లాడుతూ, సాయి ప్రత్యూష్ను ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సాయి ప్రత్యూష్ విజయం గ్రామానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి భవిష్యత్తుకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు రమేష్ గౌడ్, సక్రపు గజేందర్, న్యాలకంటి గజ్జారం, స్థానిక నాయకులు తాటి శివ, పడకంటి దత్తు, సట్ల శ్రీనివాస్, గ్రామ పెద్దలు సట్ల పెద్ద గజ్జారం, పల్లికొండ గజేందర్, శ్రీరామ్వార్ గజేందర్, నగేష్, వార్డు సభ్యులు విడిసి గజ్జారం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని అభినందించడానికి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చారు.












