నగరంలోని శివాజీ నగర్ లోని నూతన గణపతి ఆలయంలో రేపు ఉదయం 41 కలశాలతో ప్రత్యేక అభిషేక అర్చన, ధూప దీప నైవేద్యాలు సమర్పించడానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ విజ్ఞ నాయకుని ఆశీస్సులు పొందాలని అర్చకులు తెలిపారు. గత 41 రోజుల క్రితం ప్రతిష్టించిన శ్రీ విఘ్నేశ్వర విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా రేపు ఉంటుందని తెలిపారు.
నగరంలోని శివాజీ నగర్ లోని నూతన గణపతి ఆలయంలో రేపు ఉదయం 41 కలశాలతో ప్రత్యేక అభిషేక అర్చన, ధూప దీప నైవేద్యాలు సమర్పించడానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ విజ్ఞ నాయకుని ఆశీస్సులు పొందాలని అర్చకులు తెలిపారు. గత 41 రోజుల క్రితం ప్రతిష్టించిన శ్రీ విఘ్నేశ్వర విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా రేపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమం సిరిమల్లె శ్రీనివాస్, గోపు కార్తీక్, కర్డుర ప్రసాద్, గాదిరెడ్డి మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని, శివాజీ నగర్ వాసులే కాకుండా నగరంలో ఉన్న భక్తులు కూడా రావాలని అర్చకులు మనవి చేశారు.












