ఆర్మూర్: జిల్లా పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఆర్మూర్‌లో నిజామాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్‌రావు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ విఠల్‌రావును ఆప్యాయంగా పలకరించి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీ పరిస్థితులు, నియోజకవర్గాల వారీగా రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో నాయకులు, కార్యకర్తల క్షేమసమాచారంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం విఠల్‌రావు ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం ఎలా ఉందని ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన యోగక్షేమాలను వాకబు చేశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య కొద్దిసేపు ఆత్మీయ సంభాషణ సాగింది.
జిల్లా పర్యటనకు వెళ్తున్న సమయంలో ఆర్మూర్‌లో కేటీఆర్, విఠల్‌రావును కలుసుకోవడం స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో ఆసక్తి కలిగించింది.

