నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామంలో బీసీ యూత్ ఆధ్వర్యంలో గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలను పాటిస్తూ గణనాథుడిని సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమంలో యువత జై జవాన్.. జై కిసాన్ నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎలాంటి హడావుడికి తావులేకుండా భక్తిశ్రద్ధల మధ్య కార్యక్రమాన్ని కొనసాగించారు. మధ్యాహ్నంలోపే నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
హిందూ సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ యువత ముందుకు సాగాలనే సందేశాన్ని చాటేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. సంప్రదాయాలను పాటిస్తూ యువత ఐక్యతతో నిర్వహించిన నిమజ్జన కార్యక్రమం గ్రామంలో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సుధాకర్, వినోద్, సాయంధర్, లాస్మయ్య, సందీప్, మహేందర్, భూమేష్, సాగర్, హరిష్, సవీన్ తదితరులు పాల్గొన్నారు.












