సీతారాంనగర్ కాలనీ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 26
నగరంలోని సీతారాంనగర్ కాలనీలో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా శ్రీ పాండురంగ గణేష్ మండలి ఆధ్వర్యంలో లడ్డూ వేలంపాటను నిర్వహించారు. ఈ వేలంపాటలో కొండా రాహుల్ రూ.2016కు లడ్డూను సొంతం చేసుకోగా, లక్ష్మీ దంపతులు రూ.1,116కు మరో లడ్డూను దక్కించుకున్నారు.
నగరంలోని సీతారాంనగర్ కాలనీలో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా శ్రీ పాండురంగ గణేష్ మండలి ఆధ్వర్యంలో లడ్డూ వేలంపాటను నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేలంపాటలో కొండా రాహుల్ రూ.2016కు లడ్డూను సొంతం చేసుకోగా, లక్ష్మీ దంపతులు రూ.1,116కు మరో లడ్డూను దక్కించుకున్నారు. గణపతి వద్ద అలంకరించిన పది రూపాయల దండను దీక్షిత మాల్వేకర్ రూ.1,116కు వేలంలో సొంతం చేసుకున్నారు. భక్తులు వేలంపాటలో ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమం సందడిగా సాగింది.
ఈ సందర్భంగా లడ్డూ సొంతం చేసుకున్న కొండా దంపతులు మాట్లాడుతూ.. గత ఏడాది శ్రీ పాండురంగ గణపతి వద్ద సంతానం కోసం మొక్కుకున్నామని, గణపతి లడ్డూ మహాప్రసాదాన్ని స్వీకరించిన అనంతరం ఏడాదిలోపే తమకు బాబు జన్మించాడని వారు తెలిపారు. ఈసారి కూడా గణపతి లడ్డూను వేలంలో సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. శ్రీ పాండురంగ గణేష్ మండలి నిర్వాహకులు ధర్మేంద్ర దంపతులకు తాము రుణపడి ఉంటామని కొండా దంపతులు తెలిపారు. గణపతి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సుఖసంతోషాలు నెలకొనాలని వారు ఆకాంక్షించారు.
గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంపాట భక్తుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. మండలి నిర్వాహకులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











