జిల్లా కేంద్రంలోని లక్ష్మీప్రియానగర్లో సోమవారం గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా లక్ష్మీప్రియానగర్ అధ్యక్షుడు బిరేల్లి రమణారావు దంపతులు, కాలనీ పెద్దలు, వాసులు విఠల్‌రావును శాలువాతో సన్మానించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో యుగేందర్, చిన్ని కృష్ణుడు, నీలం రెడ్డి, మనోహర్‌రావు, జితేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌తో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు. మారుతీనగర్, గంగాస్థాన్ ఫేజ్1, కస్తూర్ గార్డెన్, వీవీ నగర్, ఆర్టీసీ తదితర కాలనీలకు చెందిన భక్తులు కూడా ఉత్సవాల్లో పాల్గొని గణనాథుడి ఆశీస్సులు పొందారు.











