గుండ్ల పోచంపల్లిలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధల మధ్య కన్నులపండువగా సాగింది. యువత, మహిళలు నృత్యాలు, కోలాటాలతో సందడి చేశారు. అనంతరం గణనాథుడి నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది.
గుండ్ల పోచంపల్లి మౌంట్ కైలాష్ విలాస్‌లో కమిటీ ఆధ్వర్యంలో శనివారం గణేష్ నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధల మధ్య కన్నులపండువగా సాగింది. మాజీ జడ్పీటీసీ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి శోభాయాత్రలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ శోభాయాత్రలో యువత ఉత్సాహంగా పాల్గొనగా, మహిళలు నృత్యాలు చేస్తూ, కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. భక్తుల జయజయధ్వానాలు, కోలాహలంతో పరిసర ప్రాంతం మార్మోగింది. అనంతరం సమీపంలోని చెరువులో గణనాథుడి నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నారాయణ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కాంతారెడ్డి, రవికుమార్, గౌతమ్ రెడ్డి, సురేందర్ రెడ్డి, నరేందర్ చౌదరి, రమేశ్, దినేష్, వెంకట్ రెడ్డి, విశాల్ తదితరులు పాల్గొన్నారు.












