మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని వాడపల్లి, అనుముల, వేములపల్లి, నాగార్జునసాగర్ వద్ద గణపతి నిమజ్జనం కోసం ఆర్డీవో ఎస్. రమణారెడ్డి, డి.ఎస్.పి రవి ల ఆధ్వర్యంలో అన్ని శాఖల సహకారంతో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు సబ్ కలెక్టర్ కార్యాలయం డి.ఏ.ఓ శ్రీనివాస్ శర్మ తెలిపారు.
నిమజ్జనం చేసే స్థలాల వద్ద ఏవైనా అత్యవసర సమస్యలు తలెత్తితే, సహాయం కోసం వెంటనే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు టోల్ ఫ్రీ నెంబర్ 08689 295001 కు ఫోన్ చేయాలని డి.ఏ.ఓ కోరారు.












