తిరుమలగిరిసాగర్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 15
నల్గొండ జిల్లా తిరుమలగిరిసాగర్ మండలం చింతలపాలెంలో గణేశ్ ఉత్సవాల సందర్భంగా జరిగిన వివాదం విషాదానికి దారితీసింది. తొలి పూజ నిర్వహణ విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం అనంతరం పూజారి దత్తు గుండెపోటుతో మృతి చెందారు.
పూజారి మృతి.. చింతలపాలెంలో విషాదం గణేశ్ ఉత్సవాల సందర్భంగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం గొడవ అనంతరం పూజారికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి గణేశ్ ఉత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లా మండలం చింతలపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో గణేశ్ మండపాల వద్ద తొలి పూజ నిర్వహించే విషయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. తొలి పూజ తమ మండపంలోనే నిర్వహించాలని రెండు వర్గాలు పట్టుబట్టడంతో పూజారితో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. దీంతో గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పినట్లు సమాచారం. అనంతరం ఓ గణేశ్ మండపం వద్ద పూజలు నిర్వహిస్తున్న పూజారి దత్తుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు సమాచారం. పూజారి దత్తు మృతితో చింతలపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












