కామారెడ్డి, 13 September
1980ల నాటి ట్రెండ్‌ను అనుసరిస్తున్న నెటిజన్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 1980ల స్టైల్ ఫోటో ఎడిటింగ్ ట్రెండ్ పేరుతో నకిలీ యాప్‌లు, ఫైళ్లను పంపిస్తున్నారు. ఇప్పటికే పలు నకిలీ యాప్‌లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

చాట్‌జీపీటీ వంటి యాప్‌లలో వినియోగ పరిమితులు, ఫోటో ఎడిటింగ్‌కు సంబంధించిన ఆంక్షలు ఉండటంతో.. ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న నకిలీ యాప్‌లను కొందరు నెటిజన్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే వీటి ద్వారా ఫోటోలు ఎడిట్ చేసుకునే క్రమంలో వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, ఇతర సున్నితమైన డేటా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలియని లింకులు, ఫైళ్ల ద్వారా వచ్చే యాప్‌లను డౌన్లోడ్ చేయవద్దని.. అధికారిక యాప్ స్టోర్ల నుంచే యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని వారు కోరుతున్నారు.