శాబ్దిపూర్ తండా, దేవునిపల్లి (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 14
దేవునిపల్లిలో అనుమతులు లేకుండా అధిక శబ్దంతో డీజే నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న డీజేను పోలీసులు సీజ్ చేశారు. శాబ్దిపూర్ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
శబ్ద కాలుష్యానికి కారణమైన డీజే సీజ్ దేవునిపల్లి: అనుమతులు లేకుండా అధిక శబ్దంతో డీజే నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న డీజేను దేవునిపల్లి పోలీసులు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. శాబ్దిపూర్ తండాలో ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా డీజే ఏర్పాటు చేసి శబ్ద కాలుష్యానికి కారణమైన నిర్వాహకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అధిక శబ్దంతో డీజే నిర్వహించడం వల్ల స్థానికులకు ఇబ్బందులు కలుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. అనుమతులు లేకుండా డీజేలు నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.












