నగరంలోని హైదరాబాద్ రోడ్డులో ఒక ఆసుపత్రి సమీపంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోటుకు దారితీసింది. గౌతమ్నగర్కు చెందిన ఇసాక్, మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన అతుల్ మధ్య సోమవారం సాయంత్రం ఆసుపత్రి సమీపంలోని ఒక ఇంట్లో మాట్లాడుకుంటుండగా అకస్మాత్తుగా గొడవ జరిగింది.
ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో అతుల్ కత్తితో ఇసాక్ మెడపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇసాక్‌కు గాయాలైనట్లు సమాచారం. గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘర్షణకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు.












