ఘెల్టీపురా, అహ్మదాబాద్, గుజరాత్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 10
అహ్మదాబాద్లో దారుణమైన పరువు హత్య చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం యువకుడితో ఉన్న యువతి వీడియో వైరల్ కావడంతో, ఆమెను తండ్రి, సోదరుడు కలిసి హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పరువు పేరుతో యువతిని హత్య వైరల్ వీడియో నేపథ్యంలో తండ్రి, సోదరుడిపై హత్య ఆరోపణలు అహ్మదాబాద్, గుజరాత్: గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం ఓ యువకుడితో కలిసి ఉన్న 22 ఏళ్ల యువతి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆమెను తండ్రి, సోదరుడు కలిసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాబ్రికేషన్ వ్యాపారం నిర్వహిస్తున్న నిందితులు యువతిని సర్థేజ్లోని ఘెల్టీపురా సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడ సుత్తితో దాడి చేసి హత్య చేసిన అనంతరం, ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.












