లంచం తీసుకుంటుండగా ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులకు పట్టుబడ్డారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అందిన సమాచారం ప్రకారం.. మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో పనిచేస్తున్న అశోక్, కిరణ్ అనే ఇద్దరు ఉద్యోగులు ఓ పనికి సంబంధించి రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. బాధితుడు ఈ విషయాన్ని ఎసిబి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో, ముందస్తు ప్రణాళిక ప్రకారం అధికారులు దాడి చేపట్టారు. బాధితుడి నుంచి లంచం సొమ్ము తీసుకుంటుండగా ఇద్దరు ఉద్యోగులను ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎసిబి అధికారులు వెల్లడించారు.
రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన
Share:

సారాంశం
ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు
ముఖ్య విషయాలు
- మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో పనిచేస్తున్న అశోక్, కిరణ్ అనే ఇద్దరు ఉద్యోగులు ఓ పనికి సంబంధించి రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది.
- లంచం తీసుకుంటుండగా ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులకు పట్టుబడ్డారు.
- బాధితుడు ఈ విషయాన్ని ఎసిబి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో, ముందస్తు ప్రణాళిక ప్రకారం అధికారులు దాడి చేపట్టారు.
- బాధితుడి నుంచి లంచం సొమ్ము తీసుకుంటుండగా ఇద్దరు ఉద్యోగులను ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3832ఆర్టికల్స్
4,67,178వ్యూస్










