మిర్యాలగూడ, 9 September
మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎంపీడీవో కార్యాలయంలో కాళోజికి నివాళులు (మనోరంజని తెలుగు టైమ్స్) మండల పరిషత్ కార్యాల యంలో బుధవారం ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి, తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కాళోజి చిత్రపటానికి కార్యాలయ సూపరింటెండెంట్ పి.కరుణాకర్ రావు, మండల పంచాయతీ అధికారి మాతంగి రమేష్, జెఎ క్రాంతి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇసి కళావతి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.












