లోకేశ్వరం, 9 September
మండల పరిధిలోని ధర్మారం గ్రామంలో అర్హులకు కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు బుధవారం భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడి సంజీవరెడ్డి, ఉప సర్పంచ్ మంద గణేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని, శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు.
( మనోరంజని తెలుగు టైమ్స్ ) మండల్, ధర్మారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ వైభవంగా నిర్వహించబడింది. ధర్మారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ మండల పరిధిలోని ధర్మారం గ్రామంలో అర్హులకు కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు బుధవారం నాడు భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడి సంజీవరెడ్డి, ఉప సర్పంచ్ మంద గణేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని, శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. నిర్మాణాలు నాణ్యతా ప్రమాణాలతో, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.












