నిర్మల్, 9 September
పట్టణంలోని అంబేద్కర్ భవన్, దాని పరిసరాల్లో నెలకొన్న అపరిశుభ్రతపై దళిత సంఘాల ఐక్యవేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భవనాన్ని వెంటనే శుభ్రం చేసి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేసింది.
పట్టణంలోని అంబేద్కర్ భవన్, మైదానంలో నెలకొన్న అపరిశుభ్రతను వెంటనే తొలగించి భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ వైస్ చైర్మన్, కమిషనర్లను కలిసి వినతిపత్రం అందించారు. అంబేద్కర్ భవనంలో కట్టేసి ఉన్న పశువులను, అక్కడ ఉన్న సామగ్రిని నాలుగు రోజుల్లోగా తొలగించి పరిసరాలను శుభ్రం చేయాలని వారు కోరారు. సమస్యను పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుంటోల్ల వెంకటస్వామి, కొంతం మురళీధర్, ఎలుమల రాజేశ్వర్, కొంతం గణేష్, జైల లింగం, ఆకుల రమేష్, మసీద్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.












