బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా మండల కేంద్రంలో జిల్లా పోలీసు యంత్రాంగం బుధవారం సాయంత్రం గణపతి మండప నిర్వాహక కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పలు కీలక సూచనలు చేశారు.
గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి.* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.* మనోరంజని తెలుగు టైమ్స్ జిల్లా వ్యాప్తంగా గణపతి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా మండల కేంద్రంలోని పరిచయ గార్డెన్ నందు నాలుగు మండలాలకు , బజార్హత్నూర్, నేరడిగొండ, సోనాల మండలాల గణపతి మండప నిర్వహక కమిటీ సభ్యుల సమావేశాన్ని జిల్లా పోలీసు యంత్రాంగం బుధవారం సాయంత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమన్వయ సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మండప నిర్వహణ కమిటీలు సభ్యులకు పలు సూచనలు చేయడం జరిగింది. సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుతూ, దానిని భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ గణపతి విగ్రహాల ఏర్పాటు అనే పండుగ, ప్రశాంత వాతావరణంలో ప్రజలందరూ కలిసిమెలిసి నిర్వహించుకోవాలని జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. పోలీసు యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉందని మండప నిర్వహణ కమిటీ సభ్యులను ఉద్దేశించి పలు సూచనలు చేయడం జరిగింది. ఆన్లైన్లో వచ్చిన https://policeportal.tspolice.gov.in లింకు ద్వారా ప్రతి ఒక్క గణపతి మండపం రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేసుకోవాలని, దీని ద్వారా గణపతి నవరాత్రి ఉత్సవాలలో చేయవలసిన బందోబస్తు కేటాయించవలసిన పోలీసు సిబ్బంది నిమర్జనం ఏర్పాట్లకు మరియు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్టు తెలిపారు. గ్రామాలలో సాధ్యమైనంతవరకు ఒకే గణపతి మండపం ఏర్పాటు చేసే విధంగా ప్రజలందరూ కలిసికట్టుగా ఉన్న భావాన్ని తెలియజేయాలన్నారు. గతంలో ఏర్పాటు చేసిన గణపతి మండపాలకు మాత్రమే అనుమతులు ఉన్నాయని, నూతనంగా ఏర్పాటు చేసే వారికి అనుమతులు లేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో 4 మండలాలలో ఏర్పాటు చేయనున్న గణపతి మండప నిర్వాహక కమిటీ సభ్యులు దాదాపు 250 మంది పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సీఐ లు డి గురుస్వామి, సిహెచ్ రమేష్, ఎస్సైలు వి పురుషోత్తం, రమేష్, సిబ్బంది, గణపతి మండపాల నిర్వాహకులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.












