సారంగాపూర్, సారంగాపూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
సారంగాపూర్ గ్రామానికి చెందిన దిశ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి సామల భూమేష్, అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం అభినందనీయమని అన్నారు. అరుదుగా లభించే నెగిటివ్ రక్తగ్రూప్కు చెందిన రక్తాన్ని కావేరి వాలంటరీ బ్లడ్ బ్యాంకులో ఆయన దానం చేశారు.
అత్యవసర సమయంలో రక్తదానం చేసి ఆదుకున్న దిశ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం అభినందనీయమని దిశ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి సామల భూమేష్ అన్నారు. సారంగాపూర్ గ్రామానికి చెందిన భూమేష్ అరుదుగా లభించే AB నెగిటివ్ రక్తగ్రూప్కు చెందిన రక్తాన్ని అత్యవసర సమయంలో కావేరి వాలంటరీ బ్లడ్ బ్యాంకులో దానం చేశారు. ఎమర్జెన్సీ సమయాల్లో రక్తం అవసరమైన వారికి గతంలోనూ పలుమార్లు అత్యవసరంగా రక్తదానం చేసి ఆదుకున్నట్లు తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా భూమేష్ మాట్లాడుతూ, యువత రక్తదానంపై అవగాహన పెంచుకుని, అత్యవసర సమయాల్లో ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు.












