బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 13
అఖిల భారత పద్మశాలి సంఘం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పద్మశాలి భవన్, నారాయణగూడలో పద్మశాలి ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షులు మేరుగు భోజన్నను తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు మురళి జ్ఞాపిక అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు.
పద్మశాలి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మేరుగు భోజన్నకు ఘన సన్మానం మనో రంజని తెలుగు టైమ్స్ అఖిల భారత పద్మశాలి సంఘం మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పద్మశాలి భవన్, నారాయణగూడలో పద్మశాలి ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షులు మేరుగు భోజన్నను తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు మురళి జ్ఞాపిక అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మేరుగు భోజన్న మాట్లాడుతూ, తనను మండల అధ్యక్షులుగా గుర్తించి సన్మానించి గౌరవించినందుకు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు మురళి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై చూపిన ప్రేమాభిమానాలకు, గౌరవానికి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సమాజానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తనకు లభించిన ఈ గౌరవం మరింత బాధ్యతను పెంచిందని, పద్మశాలి సమాజ అభ్యున్నతికి, సంఘం బలోపేతానికి తన వంతు కృషి ఎల్లప్పుడూ కొనసాగిస్తానని మేరుగు భోజన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రాంతాల పద్మశాలి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.











