భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హమారా ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, కించపరిచే విధంగా పోస్టులు చేసిన హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ మాట్లాడుతూ.. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై ప్రభుత్వం, పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన కల్పిత నాయకుడు పుస్తకాన్ని ప్రభుత్వం వెంటనే అడ్డుకోవాలని కోరారు. అనంతరం హమారా ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కుంటోళ్ల వెంకటస్వామి, కొంతం మురళీధర్, ఎలమల రాజేశ్వర్, ఎలమల ప్రభాకర్, ఆకుల రమేష్, దరువు భోజన్న, సందీప్, మసీదు రమేష్, కప్పకంటి సురేష్, నరేందర్, సేపురి సిద్ధార్థ, రావుల వినేందర్, పురుషోత్తం, రాజలింగం, గుండా సతీష్, మాడస్తూ భూమేష్, బత్తుల రాజు, సంపత్, దినేష్, వినోద్, గంగాధర్, తదితర జిల్లా, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమంలో సారంగాపూర్ గ్రామానికి చెందిన ఉత్తమ కళాకారుడి అవార్డు, రివార్డు గ్రహీత, ప్రజా కళాకారుడు దరువు భోజన్న తనదైన ప్రత్యేక శైలిలో డప్పు వాయిద్యంతో ఆకట్టుకున్నారు. డప్పు దరువులతో కార్యక్రమంలో ఉత్సాహాన్ని నింపుతూ పాల్గొన్న వారిని ఉర్రూతలూగించారు. ఆయన కళా ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.












