చిన్నచింతకుంట, 16 September
శ్రీకాకుళం నగరంలో లివర్‌తో బాధపడుతున్న ఒక జర్నలిస్ట్ కుటుంబానికి టెక్కలి అభయం యువజన సేవా సంఘం వారు రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు. కుటుంబ పెద్ద అనారోగ్యంతో మంచాన పడటంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
శ్రీకాకుళం నగరంలోని చిన్న బొందిలీపురం సాయిబాబా కాలనీ వద్ద అద్దె ఇంట్లో నివాసముంటున్న పైల శ్రీనివాస రావు జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఇటీవల లివర్ సమస్యతో ఇంటికే పరిమితం అయ్యారు. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన శ్రీనివాసరావు మంచాన పడడంతో ఆ ఇల్లు కన్నీటి సంద్రమైంది. తన భర్త శ్రీనివాసరావు వైద్యానికి సహకరించాలని భార్య ధనలక్ష్మి సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు. ఈ విషయం తెలుసుకున్న టెక్కలి అభయం యువజన సేవా సంఘం వారు వెంటనే స్పందించి, ఆ నిరుపేద కుటుంబానికి సహాయం చేయాలనే ఆలోచనతో బుధవారం బాధితుని భార్య ధనలక్ష్మికి మందుల ఖర్చు నిమిత్తం రూ.10,000 అందజేసినట్లు అభయం యువజన సేవా సంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాస రావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నిరుపేద జర్నలిస్ట్ కుటుంబానికి ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో ముందుకు వచ్చి తోచిన సహాయం చేయాలని కోరారు. సహాయం చేయాలనుకున్నవారు 8464865991 (ఫోన్ పే) నంబర్‌కు సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభయం సేవా సంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు, సెక్రెటరీ లార్డ్ కామేశ్వరరావు, సంఘ సభ్యులు సింహాచలం, అద్దాలు వీరభద్రాచారి, ధర్మవరపు పూర్ణాచారి, జగదీష్ పొరిడ పాల్గొన్నారు.












