లక్ష్మణ్చందా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
నిర్మల్ నియోజకవర్గ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎస్సారెస్పీ సరస్వతి కాలువకు నీటిని విడుదల చేయాలని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరిరావు కోరారు. ఈ మేరకు ఆయన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు.
నిర్మల్ నియోజకవర్గ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎస్సారెస్పీ సరస్వతి కాలువకు నీటిని విడుదల చేయాలని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరిరావు కోరారు.
ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి నిర్మల్ నియోజకవర్గానికి సరస్వతి కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరారు.
స్పందించిన మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించి, సరస్వతి కాలువకు నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
రైతుల సమస్యపై వెంటనే స్పందించి నీటి విడుదలకు చర్యలు చేపట్టిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు కూచాడి శ్రీహరిరావు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండ్రో నరేశ్ రెడ్డి, మామడ మాజీ జెడ్పీటీసీ మహమ్మద్ రఫీ, మామడ మాజీ సర్పంచ్ బాపయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.












