మంగళవారంమిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
వరి పంటలో అధిక, నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే నేల స్వభావం, పంట దశకు అనుగుణంగా సమతుల్యంగా ఎరువులు వినియోగించాలని మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి ఎం. ఋష్యేంద్రమణి రైతులకు సూచించారు. మంగళవారం మిర్యాలగూడ మండలం యాద్గారుపల్లి గ్రామంలో వరి పొలాలను సందర్శించిన సందర్భంగా ఆమె ఈ సూచనలు చేశారు.
వరిలో సమతుల్య ఎరువులయాజమాన్యంతో అధిక దిగుబడులు : వ్యవసాయ అధికారి ఎం. ఋష్యేంద్రమణి మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) వరి పంటలో అధిక, నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే నేల స్వభావం, పంట దశకు అనుగుణంగాసమతుల్యంగా ఎరువులు వినియో గించాలని మిర్యా లగూడ మండల వ్యవసాయ అధికారి ఎం. ఋష్యేంద్రమణి రైతులకు సూచించారు. మండలం యాద్గారుపల్లి గ్రామంలో వరిపొలాలనుసందర్శించిన సందర్బంగా ఆమె మాట్లాడుతూ వరిలో ఎరువులయాజమాన్యంలో భాగంగా రైతులు ఎరువులు వేసే ముందు తప్పనిసరిగా భూసార పరీక్ష చేయించి, పరీక్ష ఫలితాల ఆధారంగా సిఫారసు చేసిన మోతాదులో ఎరువులను వినియోగించాలన్నారు. నేలలో సేంద్రియ కర్బనం పెంచేందుకు జీలుగ, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పంటలను సాగు చేసి, పూత దశలో దుక్కిలో కలియదున్నడం ద్వారా నేల సారాన్ని మెరుగు పరచుకోవచ్చన్నారు. భూసార పరీక్ష ఆధారంగా సిఫారసు చేసిన భాస్వరం, పొటాష్ ఎరువులను చివరి దుక్కిలో లేదా దమ్ములో తగిన మోతాదులో వేయాలన్నారు. యూరియాను ఒకేసారి అధిక మోతాదులో వేయకుండా పంట అవసరానికి అనుగుణంగా విడతల వారీగావినియోగించాలన్నారు. ముఖ్యంగా పిలకలు తొడిగే దశ, కంకి ఏర్పడే దశకు ముందు సిఫారసు చేసిన మోతాదులో నత్రజని ఎరువులను అందించాలన్నారు. అవసరానికి మించి యూరియా వినియోగించడం వల్ల ఖర్చులు పెరగడంతో పాటు పంటలో తెగుళ్లు, పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉందని, అందువల్ల రైతులు భూసార పరీక్ష ఆధారంగా సమతుల్య ఎరువులయాజమాన్యాన్ని పాటించాలన్నారు.












