గర్గుల్ గ్రామంలో కరువు నేపథ్యంలో ఉపాధి పనులు పెంచాలని, నిరంతరం కరువును అడ్డం పెట్టుకొని పెంచుతున్న నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించాలని అఖిలభారత రైతు- కూలీ సంఘం () రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పూర్ భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తేదీ 04-11-2026 బుధవారం రోజున రామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామంలో కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు సూర నర్సయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా భూమయ్య మాట్లాడుతూ, గత ఎనిమిది మాసాల క్రితం నుంచే ఎల్.ని.నో (లా నినా) ప్రభావం గురించి హెచ్చరించిన శాస్త్రవేత్తల సలహాలను, సూచనలను పట్టించుకోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు ఏ పంటలు వేయవద్దని, తాగడానికి నీళ్లు కూడా దొరకవని ప్రజలను, రైతులను ఆందోళనకు గురి చేస్తోందని అన్నారు.
కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ, వాటి నివారణకు ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు చేపట్టలేకపోతోందని వారు అన్నారు. ముందుగా ఉపాధి పనులను విస్తరించాలని, పెంచాలని, 200 రోజులు పనులు కల్పించి రోజు కూలి 700 రూపాయలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కరువు కాలంలో వ్యాపారులు పాత బియ్యం ధరలను క్వింటాలుకు 3,000 నుంచి 3,500 రూపాయలకు పెంచుతున్నారని, ఇదేవిధంగా పప్పులు, నూనె, కారం, చింతపండు వంటి నిత్యవసర సరుకుల ధరలను కూడా పెంచి ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నారని వారు అన్నారు.
మార్కెట్లో వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచుతూ సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులను కట్టడి చేసి వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కరువు నివారణ చర్యల్లో భాగంగా, రేషన్ షాపుల ద్వారా ఒక్కొక్కరికి ప్రస్తుతం అందిస్తున్న 6 కిలోల బియ్యానికి బదులు 10 కిలోలు ఇవ్వాలని, నిత్యవసర సరుకులైన పప్పులు, నూనె, చింతపండు, కారం, అల్లం వంటి 12 రకాల వస్తువులను రేషన్ షాపుల ద్వారానే అందించాలని వారు డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి ఇస్తున్న 12 వేల రూపాయలను, గత పాలనా కాలం నాటి బకాయిలతో సహా చెల్లించాలని అన్నారు. రైతులు ఖరీఫ్ సీజన్లో తీసుకున్న రుణాలపై వడ్డీని మాఫీ చేసి, ఆ రుణాలను రీషెడ్యూల్ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రబీ సీజన్‌కు గాను, ఆరుతడి పంటల వైపు రైతులకు మళ్లించి, పొద్దుతిరుగుడు, ఆయిల్ ఫామ్, శనగలు, కుసుమ, మినుములు, పెసర్లు వంటి పంటలను ప్రోత్సహించి, వాటి విత్తనాలను రైతులకు అందించాలని వారు డిమాండ్ చేశారు.
ఇంకా ఈ సమావేశంలో అధ్యక్షులు సూర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్, షేక్ చిన్న అలీ, భాగ్య, ఆశ బి, హిమమ్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.












