నిజామాబాద్ జిల్లా మండలం పెంటఖుర్దు గ్రామంలోని సహకార సంఘం నూతన పాలకవర్గం గురువారం బాధ్యతలు స్వీకరించింది. నూతన చైర్మన్గా మద్దినేని శ్రీనివాస్ రావు, వైస్ చైర్మన్గా గైని గంగారాం, నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లు తమ బాధ్యతలను చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ దేవభక్తి నాగేశ్వర్ రావు హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ శ్రీమతి రాధిక, ఉప సర్పంచ్ పరిటాల మధు, పాతూరు గ్రామ సర్పంచ్ వెంకట్, ప్రజాప్రతినిధి సాయి పటేల్, గత సహకార సంఘం పాలకమండలి చైర్మన్ అమర్నాథ్ బాబు, మాజీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు అతిథులు ఘనంగా అభినందనలు తెలియజేశారు.
నూతన పాలకవర్గం రైతులకు, సహకార సంఘం సభ్యులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సహకార సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.












