నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆత్మ () పథకం ఆధ్వర్యంలో వ్యవసాయ, అనుబంధ శాఖల సంయుక్తంగా నిర్వహించిన కిసాన్ మేళా2026ను కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గోనె కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి మేళాలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కన్వెన్షన్ హాల్లో న ఈ కిసాన్ మేళా జరిగింది. రైతులకు అందుబాటులో ఉన్న ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, పరికరాలు, పంటల సాగు విధానాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన ప్రదర్శనలను చైర్మన్ గోనె కళ్యాణ్, కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు.
ఆధునికతతో ఉత్పాదకత పెంపు
ఈ సందర్భంగా గోనె కళ్యాణ్ మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో రైతుల కోసం కిసాన్ మేళా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆధునిక సాంకేతికతను రైతులకు చేరువ చేయడం ద్వారా వ్యవసాయంలో మరింత ఉత్పాదకత సాధించేందుకు అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ మేళా ద్వారా రైతులు కొత్త పద్ధతులు, పరికరాలపై అవగాహన పెంచుకోవచ్చని తెలిపారు.











