కుంటాల మండలం సెప్టెంబర్ 30 (మనోరంజని తెలుగు టైమ్స్): మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రథమ చికిత్స సేవలు అందిస్తున్నారని కుంటాల మండల ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు మల్కాపురం భోజన్న తెలిపారు. అత్యవసర సమయాల్లో సైతం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రథమ చికిత్స అందిస్తున్న ఆర్ఎంపీ, ల సేవలు అభినందనీయమన్నారు. వైద్య సేవలు అందుబాటులో లేని సమయాల్లో ప్రజలకు తక్షణ ప్రథమ చికిత్స అందిస్తూ, అవసరమైన సందర్భాల్లో రోగులను ఉన్నత వైద్య కేంద్రాలకు పంపిస్తున్నట్లు భోజన్న తెలిపారు. ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న ఆర్ఎంపీలకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు అందించాలని కోరారు. జిల్లా డీఎంహెచ్ఓ రాజేందర్ ఆదేశాల మేరకు ఆర్ఎంపీలు తమ పరిధిని దాటి చికిత్స చేయకూడదని, నిబంధనలకు లోబడి తమ పరిధిలోనే ప్రథమ చికిత్స సేవలు అందించాలని భోజన్న సూచించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఆర్ఎంపీలకు గుర్తింపు కార్డులు అందిస్తే వారి సేవలకు మరింత స్పష్టమైన గుర్తింపు లభిస్తుందని మల్కాపురం భోజన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, లక్ష్మణ్, శ్రీనివాస్, భూమేష్, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు 24 గంటలు ఆర్ఎంపీల సేవలు
Share:

సారాంశం
ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలి ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు మల్కాపురం భోజన్న
ముఖ్య విషయాలు
- కుంటాల మండలం సెప్టెంబర్ 30 (మనోరంజని తెలుగు టైమ్స్): మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రథమ చికిత్స సేవలు అందిస్తున్నారని కుంటాల మండల ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు మల్కాపురం భోజన్న తెలిపారు.
- అత్యవసర సమయాల్లో సైతం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రథమ చికిత్స అందిస్తున్న ఆర్ఎంపీ, ల సేవలు అభినందనీయమన్నారు.
- వైద్య సేవలు అందుబాటులో లేని సమయాల్లో ప్రజలకు తక్షణ ప్రథమ చికిత్స అందిస్తూ, అవసరమైన సందర్భాల్లో రోగులను ఉన్నత వైద్య కేంద్రాలకు పంపిస్తున్నట్లు భోజన్న తెలిపారు.
- ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న ఆర్ఎంపీలకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు అందించాలని కోరారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4055ఆర్టికల్స్
4,89,109వ్యూస్










