జిల్లాలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలందించిన టీం లీడర్ వ్యాస్ ను జిడిఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం సన్మానించింది. నుండి ఇలాబాద్ జిల్లాకు బదిలీ అవుతున్న సందర్భంగా ఈ సన్మానం జరిగింది.
రాజీవ్ ఆరోగ్యశ్రీ టీం లీడర్ వ్యాస్ సేవలు అభినందనీయమని జి డి ఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ అన్నారు. జిల్లా నుండి ఇలాబాద్ జిల్లాకు స్థానచలనం పొందుతున్న వ్యాస్ ను సన్మానించి అభినందించారు.
సేవకు గుర్తింపు తప్పనిసరి
ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ మాట్లాడుతూ సేవకు గుర్తింపు తప్పనిసరిగా ఉంటుందని అన్నారు. విధి నిర్వహణలో మరింత చురుకుగా సేవలు అందించి, ఆరోగ్యశ్రీ పథకానికి మంచి పేరు కొని రావాలని సూచించారు.
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వ్యాస్ మార్గదర్శనంలో డాక్టర్ వివి హేమంత్ కళ్యాణ్ జిడిఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సేవలు అందించడానికి 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందించారని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ సిబ్బందితోపాటు, ఆసుపత్రి ఏవో జాధవ్ పుండలిక్ రావు పాటిల్, పీవో రఘువీర్ పాటిల్, సిబ్బంది పాల్గొన్నారు.






