తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కిసాన్ మేళా 2026 ను నిర్మల్ లో ఘనంగా నిర్వహించనున్నారు. ఆత్మ పథకం ఆధ్వర్యంలో వ్యవసాయ మరియు అనుబంధ విభాగాలు సంయుక్తంగా అధునిక సాంకేతికతను రైతులకు చేరువ చేసే ఉద్దేశ్యంతో ఈ కిసాన్ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ కిసాన్ మేళాకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అధికారులు విడుదల చేశారు.
జిల్లాలోని రైతులందరూ ఈ మేళాకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ మేళా గురువారం రోజున నిర్మల్ లోని ఎఫ్ ఎస్ సి ఎస్ కన్వెన్షన్ హాల్ లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ఈ మేళా లక్ష్యమని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని మన ప్రాంత రైతులను ఉత్సాహపరచాలని కోరుతున్నాము. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి కిసాన్ మేళాలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ ఆహ్వాన పత్రికను బి సుజాత ప్రాజెక్టు డైరెక్టర్ ఆత్మ మరియు జిల్లా వ్యవసాయ అధికారి, నిర్మల్ జిల్లా భవేష్ మిశ్రా ఐఏఎస్ కలెక్టర్ మరియు చైర్మన్ ఆత్మ నిర్మల్ జిల్లా జారీ చేశారు.











