బాసర, 2026-09-13
బాసర మండల ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం 202627 సంవత్సరానికి ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ ఎన్నికల్లో బత్తిరి ప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మీడియా సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు తెలిపారు.
బాసర ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక బాసర బాసర మండల ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం 2026–27 సంవత్సరానికి ఏకగ్రీవంగా ఎన్నికైంది. నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షుడిగా సంగవార్ హన్మంత్ రావు, అధ్యక్షుడిగా బత్తిరి ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా నర్సూరి భీమ్ రావు, ప్రధాన కార్యదర్శిగా గణేష్ జాదవ్, కార్యదర్శిగా మమ్మాయి మహేందర్, పీఆర్వోగా పింపలే రామేశ్వర్, కోశాధికారిగా ఆనంద్ బండారిని ఎన్నుకున్నారు.కార్యవర్గ సభ్యులుగా పల్లె హరిదాస్, కొదటి సుధాకర్, రత్నల్లి రమేష్, అవదూత్, మొజెస్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బత్తిరి ప్రసాద్ మాట్లాడుతూ.. మీడియా సభ్యుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం నూతన అధ్యక్షుడు బత్తిరి ప్రసాద్‌ను తోటి మీడియా సభ్యులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.












