ముధోల్, 12 September
మండలం చించాల గ్రామపంచాయతీలో శనివారం డిజిటల్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సర్పంచ్ దొడ్డికింది సర్వేష్, ఉపసర్పంచ్ పీసర సాయినాథ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్డుల ద్వారా రేషన్ బియ్యం పొందడం సులభతరం అవుతుందని అధికారులు తెలిపారు.
డిజిటల్ రేషన్ కార్డులు లబ్ధిదారులకు పంపిణీ మండలం చించాల గ్రామపంచాయతీలో శనివారం డిజిటల్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సర్పంచ్ దొడ్డికింది సర్వేష్, ఉపసర్పంచ్ పీసర సాయినాథ్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. డిజిటల్ కార్డులతో రేషన్ బియ్యం పొందడం మరింత సులభతరమైందని సాయినాథ్ గౌడ్ తెలిపారు. కార్డులు అందుకోవడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ ఉమా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.












