భైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 13
భైంసా మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కాంట్రాక్టర్లు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. తమకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, అయితే అధికారుల నుంచి ఎలాంటి హామీ లభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
నాలుగో రోజుకు చేరిన కాంట్రాక్టర్ల రిలే నిరాహార దీక్ష భైంసా: భైంసా మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కాంట్రాక్టర్లు దీక్షను కొనసాగిస్తున్నారు. తమకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నప్పటికీ ఇప్పటివరకు మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి హామీ లభించలేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించడంతో పాటు తమ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. అధికారులు స్పందించకపోతే తదుపరి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు. సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.












