మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ వర్థంతి సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. బస్టాండ్ కూడలిలో గల కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ... కొండాలక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమానికి, చేనేత కార్మికుల సంక్షేమానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. 1969 తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యజించిన గొప్ప దేశభక్తుడని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన పడిన తపన భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మెరుగు భోజన్న, ప్రధాన కార్యదర్శి మాసం అనిల్ కుమార్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సిరిపురం చంద్ర మోహన్, కోశాధికారి కటకం నగేష్, వడ్లకొండ సురేందర్, గుండు మల్లేష్, కొమారి దయాకర్, కొండ స్వామి, వార్డ్ సభ్యులు సాయి కట్కూరి, ఆడెపు కిరణ్, కటకం ప్రసాద్, కదెరుగుల గోవర్ధన్, వడ్లకొండ శ్రీనివాస్, ఉసికెల శేఖర్, బిట్లింగ్ సంతోష్, పద్మశాలి సంఘ పెద్దలు మరియు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు
Share:

సారాంశం
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వర్థంతి సందర్భంగా నివాళులర్పించిన నాయకులు, కార్యకర్తలు
ముఖ్య విషయాలు
- 1969 తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యజించిన గొప్ప దేశభక్తుడని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
- మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ వర్థంతి సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు.
- బస్టాండ్ కూడలిలో గల కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
- కొండాలక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమానికి, చేనేత కార్మికుల సంక్షేమానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3840ఆర్టికల్స్
4,68,158వ్యూస్










