సంఘం (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 21
నిజింగపూండ కేంద్రంలో కొండకషణబపూజీ 14వ వర్ధంతిని పద్మశాలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయ ఆవరణలో సోమవారం కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతిని పద్మశాలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
బాపూజీ పోరాట స్ఫూర్తి
అనంతరం పద్మశాలి మండల అధ్యక్షులు సామల వీరయ్య మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. పదవుల కంటే ప్రజల ఆకాంక్షలకే ప్రాధాన్యం ఇచ్చిన గొప్ప పోరాటయోధుడని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మీ నారాయణ, ప్రసాద, శంకర్, భుమేష్, నర్సయ్య, శ్రీనివాస్, యోగేష్ పలువురు పాల్గొన్నారు.







