తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తాను ర్ మండలంలోని వివిధ గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో దేశభక్తి, ఆధ్యాత్మికతకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బోరిగాం గ్రామంలోని బాలాజీ గుట్టపై గ్రామ అధ్యక్షుడు పల్లె విఠల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు.
అదేవిధంగా బోసి గ్రామంలోని వినాయక మండపంలో ప్రత్యేక పూజా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో మండల అధ్యక్షుడు పుండ్ర లక్ష్మణ్రెడ్డి, మండల భాజపా ప్రధాన కార్యదర్శి బాయి నర్సింహులు, మాజీ సర్పంచ్ సింగన్గాం మారుతి, బోరిగాం సర్పంచ్ సుధాకర్, నాగన్న, బోసి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.












