లోకేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ధార్వాడి కపిల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
తెలంగాణ విమోచన పోరాటయోధుల త్యాగాలను ఈ కార్యక్రమంలో స్మరించుకున్నారు. వారి పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పంచాయతీ సెక్రెటరీ రాజేశ్వర్, ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












